పవన్ సినిమా మీదే సాక్షి ఆశలన్నీ!
సినిమా ఇండస్ట్రీలో లక్, సక్సెస్ అనేవి చాలా కీలకం. ఎలాంటి సినిమాలు చేశారు? ఆ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చిందన్న దానిపైనే కెరీర్లు ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు హీరోయిన్ యావరేజ్‌గా ఉన్నా, పెద్దగా యాక్టింగ్ రాకపోయినా తను చేసిన సినిమా హిట్ అయితే ఆ కారణంగా వరుసగా అవకాశాలొస్తుంటాయి. కొన్ని సార్లు కొంతమందికి అందం, అభినయం రెండూ ఉన్నా, సక్సెస్ లేకపోతే ఛాన్సులు రావు. వాళ్లు ఎంత మంచి నటనను కనబరిచినా, సినిమా తేడా కొడితే వాళ్లూ కనుమరుగవుతారు. చాలా కొద్ది మందికే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు వస్తుంటాయి. ఏజెంట్ సినిమాతో ఈ ఇయర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాక్షి వైద్యకు స్టార్ హీరోయిన్ కావాల్సిన ఫీచర్లు అన్నీ ఉన్నాయి.
ఏజెంట్ డిజాస్టర్ అయినప్పటికీ, ఆ సినిమాలో తన అందచందాలు ఆకట్టుకున్నాయి. టాప్ హీరోయిన్ కాగల ఫీచర్స్ కూడా సాక్షిలో ఉన్నాయి. యాక్టింగ్ పరంగా కూడా సాక్షి మంచి మార్కులే వేయించుకుంది. కానీ ఫస్ట్ సినిమానే ఫ్లాప్ కావడంతో సాక్షికి నిరాశ తప్పలేదు. అయితే ఈ రిజల్ట్ తో సంబంధం లేకుండా సాక్షికి వరుణ్ సరసన గాండీవధారి అర్జున, పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. రీసెంట్గా వచ్చిన గాండీవధారి అర్జున కూడా డిజాస్టర్ కావడంతో, మరోసారి ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది సాక్షి. దీంతో తన ఆశలన్నీ ఉస్తాద్ భగత్సింగ్పైనే ఉన్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ కాబట్టి హీరోయిన్ ను బాగా చూపిస్తాడు. దానికి తోడు పవన్ తో సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు పెట్టుకోవడం మామూలే.













