క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన సాక్షి
ఏజెంట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన సాక్షి వైద్య మొదటి సినిమానే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా హిట్ అవలేదు. తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన గాండీవధారి అర్జున కూడా డిజాస్టర్ అవడంతో ఆమెపై పెద్దగా అటెన్షన్ నిలవలేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమా ఎప్పుడొస్తుందనేది తెలియడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సాక్షికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హీరో శర్వానంద్ చేస్తున్న సినిమాలో సాక్షి నటించనున్నట్లు తెలుస్తోంది. సామజవరగమన సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై మంచి సక్సెస్ అందుకున్న రామ్ అబ్బరాజ్ ఇప్పుడు తన రెండో సినిమాను శర్వానంద్ తో చేస్తున్నాడు. తాజాగానే ఈ సినిమా షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తోంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, మరో హీరోయిన్ గా సాక్షిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆగస్ట్ 12 నుంచి ఈ సినిమా షూటింగ్ లో సాక్షి జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా హిట్టయితే మాత్రం సాక్షికి తెలుగు ఛాన్సులు రావడం ఖాయం. మరి శర్వానంద్ సాక్షికి ఎంతవరకు బ్రేక్ ఇస్తాడనేది చూడాలి.













