సకల కళా వల్లభుడు టీజర్ విడుదల
దీపాల ఆర్ట్స్ సమర్పణలో సింహ ఫిలిమ్స్ పతాకంపై తనిష్క్‌రెడ్డి హీరోగా, శివగణేష్ దర్శకత్వంలో అనిల్, త్రినాధ్, కిషోర్, శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం సకల కళావల్లభుడు. ఈ చిత్రం టీజర్‌ను నటుడు పృధ్వీ ఆవిష్కరించారు. నిర్మాత అనిల్ మాట్లాడుతూ హీరో తనిష్క్ మా సినిమాకు పెద్ద ఎస్సెట్ అన్నారు ఫైట్స్ డ్యాన్స్ బాగా చేశాడన్నారు. అందరూ కష్టపడి పనిచేశారన్నారు. సెన్సార్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నామని, త్వరలో విడుదల కాబోతోందని అన్నారు. కార్యక్రమంలో మరో నిర్మాత శ్రీకాంత్, డైరెక్టర్ శివగణేష్, హీరో తనిష్క్‌రెడ్డి నటుడు పృధ్వీ తదితరులు మాట్లాడారు. తనిష్క్‌రెడ్డి, మేఘల గుప్తా, జీవ, పృధ్వీ, సుమన్, చిన్నా, శృతి, అపూర్వ తదితరులు ప్రధానం తారాగణం.













