మళ్లీ బిజీ అయిన పూరీ తమ్ముడు
పూరీ జగన్నాథ్ తమ్ముడిగా సాయి రాం శంకర్ అందరికీ బాగా పరిచయస్తుడే. గత ఏడేళ్లుగా సినిమాలకు దూరమైన సాయి రాం శంకర్ ఈ సంవత్సరం తన సత్తా చాటనున్నాడు. సాయి రాం చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఒక పథకం ప్రకారం, వెయ్ దరువెయ్, బంపర్ ఆఫర్-2 సినిమాలకు సాయి రాం శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వీటిలో మొదటి రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుంటే, బంపర్ ఆఫర్-2 మాత్రం ఇంకా మొదలు కావాల్సి ఉంది. సాయి రాం శంకర్ నుంచి చివరిగా వచ్చిన సినిమా నేనోరకం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేయకపోవడంతో తర్వాత అతన్నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ స్వయంగా కష్టపడి ఈ అవకాశాలను అందుకున్నట్లు తెలుస్తోంది.
సాయి రాం శంకర్ కు ఉన్న పరిస్థితికి ఇప్పుడు తప్పకుండా ఓ హిట్ అవసరం. తనకు మంచి సక్సెస్ వస్తే తిరిగి ట్రాక్ ఎక్కేస్తాడు. బంపర్ ఆఫర్ సినిమా ఎంత మంచి హిట్ అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే సక్సెస్ ను కొనసాగించాలని ఆ సినిమాకు సీక్వెల్ ను తీయాలని సాయి రాం చూస్తున్నాడు. మరి ఈ మూడు సినిమాలు అతనికి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడతాయో చూడాలి.













