‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్ రాంగ్ యూసేజ్ నవంబర్ 21న విడుదల
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. వెరీ ట్యాలెంటెడ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఓ అప్డేట్ను అందించారు.
నవంబర్ 21న సినిమా ఫస్ట్ సింగిల్-రాంగ్ యూసేజ్‌ని లాంచ్ ద్వారా మ్యూజికల్ జర్నీని కిక్ స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సాంగ్ పోస్టర్లో వెంకటేష్ డ్యాన్సర్లతో కలిసి మాస్ డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. రాంగ్ యూసేజ్ సంతోష్ నారాయణన్ స్కోర్ చేసిన ఫుట్ ట్యాపింగ్ నంబర్ కానుంది.
గత నెలలో విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి అన్నివైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. శైలేష్ కొలను, వెంకటేష్‌ని మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారని ప్రశంసలు అందుకున్నారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
‘సైంధవ్’ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది.













