Sailesh: డైరెక్టర్ కు తలనొప్పిగా మారిన విలన్ పాత్రలు
శైలేష్ కొలను(sailesh kolanu) దర్శకత్వంలో నాని(nani) హీరోగా తెరకెక్కిన హిట్3(hit3) మూవీ రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అందరినీ సంతృప్తి పరిచినా ఓ విషయంలో మాత్రం అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్(Pratheek Babbar) పాత్ర. అతని పాత్రను శైలేష్ డిజైన్ చేసిన విధానం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అప్పటివరకు కథనాన్ని ఎంతో బాగా డీల్ చేసిన శైలేష్, విలన్ దగ్గరికొచ్చేసరికి కథను తేలిపోయేలా చేస్తున్నాడు. అయితే ఇది ఫస్ట్ టైమ్ కాదు. శైలేష్ గతంలో చేసిన సినిమాల విషయంలో కూడా ఈ కంప్లైంట్ ఉంది. హిట్3 కు ముందు చేసిన సైంధవ్(saindhav) కోసం ఏకంగా బాలీవుడ్ నుంచి నవాజుద్దీన్ సిద్దిక్(nawazuddin siddiqui) లాంటి గొప్ప నటుడిని తీసుకొచ్చి, అతని పాత్రను తేలిపోయేలా చేశాడు.
దానికి ముందు చేసిన హిట్2(Hit2), హిట్1(Hit1)లో కూడా శైలేష్ విలన్ పాత్రలను అలానే రాసుకున్నాడు. హిట్2లో సుహాస్(suhas) విలన్ అని రివీల్ చేసే వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత సుహాస్ పాత్ర తాలూకా బ్యాక్ డ్రాప్ విషయంలో మరియు హిట్1 క్లైమాక్స్ ట్విస్ట్ లో కూడా శైలేష్ ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నాడు. కాబట్టి తర్వాతి సినిమాల్లో విలన్ పాత్రల విషయంలో అయినా శైలేష్ జాగ్రత్త పడి, వాటిని మరింత మెరుగ్గా డిజైన్ చేసుకుంటే బెటర్.






