Roshan Meka: హిట్ డైరెక్టర్ తో రోషన్ సినిమా

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ తన యాక్టింగ్ తో ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశాడు రోషన్(Roshan Meka). శ్రీకాంత్(srikanth) కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న రోషన్ నెక్ట్స్ మూవీ ఖరారైనట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రోషన్ రెండు సినిమాలతో బిజీగా ఉండగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిట్(Hit), హిట్2(hit2), హిట్3(hit3), సైంధవ్(saindhav) లాంటి వయొలెంట్, యాక్షన్ థ్రిల్లర్లకు డైరెక్షన్ వహించిన డైరెక్టర్ శైలేష్ కొలను(sailesh Kolanu)తో రోషన్ సినిమా చేయనున్నాడు. రోషన్ తో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు వయొలెంట్ డైరెక్టర్ శైలేష్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్, వయొలెన్స్ సినిమాలే తీసిన శైలేష్ ఇప్పుడు కొత్తగా తన రూట్ మార్చి లవ్ స్టోరీని తీయనుండటం విశేషంగా మారింది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ(suryadevara nagavamsi) నిర్మించనున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్(mohanlal) తో కలిసి వృషభ(vrushabha) సినిమాతో పాటూ ఛాంపియన్(champion) అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు.