సైఫ్ దొరకడం కష్టమే!
దేవర(devara) సినిమాతో టాలీవుడ్(Tollywood) కు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) రూపంలో ఓ విలన్ దొరికాడు. ఈ సినిమాలో భైర పాత్రలో అతను అద్భుతమైన నటన ప్రదర్శించాడు. డబ్బింగ్ వేరే వాళ్లతో చెప్పించినా తన ఎక్స్ప్రెషన్స్, విలనిజం సినిమాలో బాగా పండింది. ఈసారి కొరటాల శివ(Koratala Siva) సెలక్షన్ మిస్ ఫైర్ అవలేదు. రొటీన్ గా అనిపించే రెగ్యులర్ ఆర్టిస్టులను తీసుకోకుండా సైఫ్ ను సెలెక్ట్ చేసుకోవడం వల్లే ఎన్టీఆర్(NTR) పాత్రకు ఎలివేషన్ బాగా కుదిరింది.
అయితే టాలీవుడ్ కు క్రేజీ విలన్ దొరికాడని సంబరపడటానికి లేదు. ఎందుకంటే ఆయన కాల్షీట్స్ దొరకడం చాలా కష్టం. బాలీవుడ్ లో చాలా కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న సైఫ్ కు దేవర కథ నచ్చడంతో పాటూ రూ.13 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే ఈ సినిమాకు ఒప్పుకున్నాడని టాక్. ఆ రేంజ్ పారితోషికం ఇవ్వాలంటే మీడియం రేంజ్ నిర్మాతలు ఇవ్వలేరు.
రూ.100 కోట్ల కంటె ఎక్కువ బడ్జెట్ పెట్టే వారికే అది కుదురుతుంది. సైఫ్ ప్రస్తుతం దేవర2(Devara2కు తప్ప మరో తెలుగు సినిమా ఒప్పుకుంది లేదు. దేవర2కు కూడా ఇంకా డేట్స్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ వార్2(War2), ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాలు పూర్తయ్యాకే కొరటాల ఈ సీక్వెల్ ను మొదలుపెడతాడు. ఎంతలేదన్నా దానికి మరో రెండేళ్లు పడుతుంది. ఇదిలా ఉంటే స్పిరిట్(spirit) కోసం సైఫ్ తో పాటూ తన భార్య కరీనా(kareena)ను కూడా సందీప్ రెడ్డి(sandeep reddy vanga) రంగంలోకి దించుతున్నాడని సమాచారం. మరి ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.













