సైఫ్ క్యారెక్టర్‌కు గూస్బంప్స్ గ్యారెంటీ..
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లోపు షూటింగ్ ను పూర్తి చేయాలని కొరటాల చాలా పట్టుదలతో ఉన్నాడట. దాన్ని దృష్టిలో పెట్టుకునే కొరటాల రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడని సమాచారం.
కాగా దేవరలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించనున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. హీరోగా సైఫ్ రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజా సమాచారం ప్రకారం దేవర సినిమాలో సైఫ్ క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ ను కొరటాల ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
దేవరలో సైఫ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని, విలన్ క్యారెక్టర్ కు నిలువెత్తు నిదర్శనం అనేలా ఈ పాత్రను కొరటాల మలిచాడని, ఈ పాత్రను స్క్రీన్ పై చూస్తున్నప్పుడు గూస్బంప్స్ రావడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆదిపురుష్ సినిమాలో రావణ్ క్యారెక్టర్ ను మించేలా దేవర సినిమాలో సైఫ్ క్యారెక్టర్ ఉండబోతుందని కూడా సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే దేవర సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఈ సినిమాను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.













