ఎన్టీఆర్ 30 విలన్ రోల్ ఆయన చేస్తే నెక్స్ట్ లెవలే..!
ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో రాబోతున్న విషయం తెలిసిందే. గతేడాదే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినా కూడా కరోనా వల్ల ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. వచ్చే నెలలో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మే నుంచి ఎన్టీఆర్30 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులున్నాయని తెలుస్తుంది.
ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను త్రివిక్రమ్ ఫైనల్ చేశాడని వార్తలొచ్చాయి. కథ గురించి, వేరే విషయాల గురించి కూడా రష్మికతో త్రివిక్రమ్ చర్చించారట. ఇక ఇప్పుడు ఈ సినిమాలో విలన్ రోల్ ఎవరు చేయనున్నారనే విషయం గురించి చర్చ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చేందుకు సినిమాలో బాలీవుడ్ స్టార్ ను విలన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఆది పురుష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సైఫ్ అలీ ఖాన్ ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకుంటే మాత్రం ఈ సినిమా తర్వాతి స్థాయికి వెళ్లడం ఖాయమని అందరూ అభిప్రాయ పడుతున్నారు. మరి సైఫ్ ఈ ప్రాజెక్టును ఓకే చేస్తారో లేదో చూడాలి.













