ఎన్టీఆర్ మూవీని రిజెక్ట్ చేసిన సైఫ్
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియన్ మూవీపై అందరికీ తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఏడాదికి పైగా ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూశారు. మొత్తానికి వారి నిరీక్షణకు తెర దించుతూ, రీసెంట్‌గానే ఈ షూటింగ్‌ను మొదలుపెట్టారు. సెట్లో తారక్ అడుగు పెట్టిన వీడియోకు భారీ స్పందన రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ సినిమాకు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ అనిరుధ్ తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మెయిన్ విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా నెట్టింట మాత్రం ఆయనే ఈ సినిమాలో విలన్ అంటూ కథనాలు రాస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ ఆఫర్‌ను సైఫ్ సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొరటాల ఈ మూవీని సైన్ చేయడం కోసం బల్క్ లో డేట్లు అడగడమే కారణంగా తెలుస్తోంది. ఈ సినిమాకు డేట్లు ఇస్తే తాను ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు ఇబ్బందవుతుందనే కారణంతో ఈ ఆఫర్‌ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదీ కాకుండా, టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సైఫ్‌కు ఆదిపురుష్ సినిమా వల్ల కాస్త నెగిటివిటీ వచ్చింది. అది కూడా ఓ కారణమై ఉండొచ్చు. మొత్తానికి ఎన్టీఆర్30ని కొరటాల చాలా కసితో చేస్తున్నాడనేది మాత్రం తెలుస్తోంది.













