Saif Ali Khan: ఆ దాడిని డ్రామా అన్నారు

ఈ ఏడాది జనవరిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో సైఫ్ గాయపడ్డాడు. దాడి వల్ల జరిగిన గాయంతో సైఫ్ వారం రోజుల పాటూ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. వారం తర్వాత పూర్తిగా కోలుకున్న సైఫ్ ఇంటికి వెళ్లాడు. రీసెంట్ గా ఓ సందర్భంగా సైఫ్ ఆ సంఘటన గురించి మాట్లాడాడు.
తనపై జరిగిన ఎటాక్ ను కొందరు డ్రామా అన్నారని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు తాను నడుచుకుంటూ బయటకు రావడం పెద్ద సంచలనమైపోయిందని, తన కోసం అందరూ ఎదురుచూస్తుండటం తెలిసి వీల్ చైర్ లో కాకుండా నడుచుకుంటూ వచ్చి తాను బానే ఉన్నానని చెప్పాలనుకున్నానని, కానీ తాను నడుచుకుంటూ రావడమే తప్పైందని చెప్పాడు సైఫ్.
తాను అలా నడిచి రావడాన్ని అపార్థం చేసుకుని, తనపై ఎలాంటి దాడి జరగలేదని, అదంతా డ్రామానే అని ప్రచారం చేశారని, దీన్ని బట్టి మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థమవుతుందని అసహనం వ్యక్తం చేశాడు సైఫ్. అయితే ఈ ఘటనలో బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షర్పుల్ ఇస్లాం(Mohammad Sharpul Islam) ను పోలీసులు అరెస్టు చేయగా, రూ.30 వేల కోసం సైఫ్ పై దాడి చేసినట్టు విచారణ లో తేలింది.