The India House : ‘ది ఇండియా హౌస్’ నుంచి సతి గా సాయి మంజ్రేకర్ పరిచయం

నిఖిల్ మచ్- (Nikhil Much)అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ(Ram Vamsi krishna) దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా ఫిమేల్ లీడ్ సాయి మంజ్రేకర్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమె సతి పాత్రను పోషిస్తుంది, సాంప్రదాయ అవతార్ అందంగా కనిపించింది. సొగసైన చీర, నగలు ధరించి దూరం వైపు చూస్తూ ఎలిగెంట్ గా కూర్చున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ ఎట్రాక్టివ్ పోస్టర్ లో అద్భుతంగా కనిపిస్తోంది.
ఈ పీరియడ్ డ్రామా1905లో సెట్ చేయబడింది. ఇది ప్రేమ, విప్లవం ఇతివృత్తాలను చూపుతోంది. నిఖిల్, సాయి మంజ్రేకర్ ల ప్రేమకథ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటి కానుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.