సరైన డెసిషన్స్ తీసుకున్న సాయి పల్లవి
కొన్నిసార్లు కొంతమందికి వచ్చిన సినిమాలను వివిధ కారణాలతో చేయకుండా వదులుకుంటారు. అలా వదులుకున్న సినిమాల్లో కొన్ని హిట్లు అవొచ్చు, మరికొన్ని ఫ్లాపులు కావొచ్చు. కానీ సాయి పల్లవి విషయంలో మాత్రం ఏం జరిగినా మన మంచికే అన్నట్లే అనిపిస్తోంది. సాయి పల్లవి నో చెప్పిన రెండు సినిమాల విషయంలో ఇప్పుడు నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతుంది.
వాటిలో ఒకటి భోళా శంకర్. ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన చెల్లి పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని సంప్రదించగా, ఆ క్యారెక్టర్ చేయడానికి సాయి పల్లవి ఒప్పుకోలేదు. రీమేక్ సినిమాల్లో చేయకూడదని ముందే ఫిక్స్ కావడంతో చిరంజీవి సినిమా అయినా సరే సాయి పల్లవి నిర్మొహమాటంగా నో చెప్పేసింది. తీరా భోళా శంకర్ ఫలితం చూస్తే సాయి పల్లవి నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది.
ఇక రెండో సినిమా చంద్రముఖి2. ఈ మూవీ కూడా మొదట సాయి పల్లవి దగ్గరికే వెళ్లిందట. మూవీ హిస్టరీ క్లాసిక్ పెర్ఫార్మెన్స్ ల్లో ఒకటిగా నిలిచిన శోభన, జ్యోతిక రేంజ్ లో తాను నటించలేనని, ఛాలెంజింగ్ గా తీసుకుని నటించినా ఏదోలా పోల్చి రచ్చ చేస్తారని నో చెప్పేసింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూశాక ఈ సినిమా రీమేక్ మూవీ అనే ఫీలింగే ఎక్కువుంది. సినిమాకు ఎలాంటి రిజల్ట్ వచ్చినా చంద్రముఖితో పోల్చడం కన్ఫర్మ్ కాబట్టి, ఈ మూవీ వదులుకుని కూడా సాయి పల్లవి సరైన నిర్ణయమే తీసుకుంది.













