2021 సాయి పల్లవిదే..!
కరోనా క్రైసిస్ నుంచి బయటపడి టాలీవుడ్ నెమ్మదిగా కోలుకుంటుంది. ఉప్పెన, నాంది, జాతి రత్నాలు లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తర్వాతి సినిమాలపై కూడా జనాల్లో బాగానే అంచనాలున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి ఆసక్తి లవ్ స్టోరీ, విరాఠ పర్వం సినిమాల మీదే. ఈ రెండు సినిమాలపైనే ఆడియన్స్ ఫోకస్ ఉండటానికి మెయిన్ రీజన్ అందులో నటిస్తున్న హీరోయిన్ సాయి పల్లవినే.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు నెట్ ల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. సాయి పల్లవి నటన ముందు చైతూ, రానా లు కూడా చిన్నబోయారన్న టాక్ వచ్చేసిందంటే సాయి పల్లవి పెర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సాయి పల్లవి ఏ సినిమాలో చేసినా సినిమాకు పెద్ద ఎస్సెట్ ఆమెనే. సారంగదరింయా సాంగ్ తో లవ్ స్టోరీకి ఒక రేంజ్ లో హైప్ తెచ్చిందంటే ఆ క్రెడిట్ కూడా ఆమెదే.
ఇక విరాఠపర్వం టీజర్ లో కూడా సాయి పల్లవి మాస్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. పల్లెటూరి అమ్మాయిగా ఇంటెన్స్ పెర్ఫామెన్స్, తెలంగాణ యాస తో సాయి పల్లవి ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలకు సాయి పల్లవే ప్లస్. కొన్ని రోజుల గ్యాప్ తోనే ఈ రెండూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ సాయి పల్లవి తన నట విశ్వరూపం చూపించే అవకాశాలున్నాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత శ్యామ్ సింఘరాయ్ లో కూడా సాయి పల్లవి కనిపించనుంది. ఇలా ఏ యాంగిల్ లో చూసినా 2021 లో బెస్ట్ యాక్ర్టెస్ గా సాయి పల్లవి కి యునానిమస్ గా ఫిక్స్ అయిపోవచ్చు.













