ఆటోడ్రైవర్ గా సాయిపల్లవి
తొలినాళ్ల నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది సాయిపల్లవి. తమిళ చిత్రం మారి-2 కోసం ఆటోడ్రైవర్‌గా అవతారమెత్తింది ఈ సొగసరి. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఇందులో ముక్కుపుడక, మెడలో రుద్రాక్ష ధరించి ఖాకీచొక్కాతో మాస్‌లుక్‌లో కనిపిస్తున్నది సాయిపల్లవి. అరత్తు ఆనంది అనే ఆటోడ్రైవర్‌గా సాయిపల్లవి ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు దర్శకుడు బాలాజీ మోహన్ తెలిపారు. రౌడీ మనసత్త్వం కలిగిన అల్లరి అమ్మాయిగా ఆమె పాత్రచిత్రణ నవ్యరీతిలో ఉంటుందని అన్నారు. 2015లో విజయవంతమన మారి చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ స్యీయ నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













