Sai Pallavi: నితిన్ కు జోడీగా సాయి పల్లవి?
సాయి పల్లవి(Sai Pallavi) ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా అమరన్(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్(Thandel) సినిమా చేస్తుంది. హిందీలో అమీర్ ఖాన్(Amir Khan) కొడుకుతో ఓ సినిమాతో పాటూ ప్రిస్టీజియస్ రామాయణం(Ramayanam)లో కూడా నటిస్తోంది.
సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహించే సాయి పల్లవి కథ మొత్తం విని తనకు బాగా నచ్చితే కానీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పల్లవి తాజాగా నితిన్(Nithin) కు జోడీగా ఎల్లమ్మ(Yellamma) కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బలగం(Balagam) తర్వాత వేణు(Venu) ఎల్లమ్మ కథను రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాను వేణు ముందుగా నాని(Nani)తో చేద్దామనుకున్నాడు.
కానీ కొన్ని కారణాల వల్ల నాని ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో అది నితిన్ చేతిలోకి వెళ్లింది. దిల్ రాజు బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎంపికైందని, పల్లవికి ఈ కథ బాగా కనెక్ట్ అయిందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.













