యన్టీఆర్ #30 లో సాయి పల్లవి హీరోయిన్?
యంగ్ టైగర్ యన్టీఆర్ #30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన 30,31వ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. ఇక యన్టీఆర్ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నారన్న విషయం కూడా బహిర్గతమే! ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభించబోతున్నట్టు కూడా మేకర్స్ వెల్లడించారు. అయితే, త్వరలో మొదలవబోతున్న ఎన్టీఆర్ 30 చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇందులో ముందు ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయాన్ని ఆలియా హింట్ ఇచ్చింది. కానీ, ఆలియా పెళ్లి చేసుకున్న తర్వాత ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఆమె ఇందులో నటించడం లేదు. దాంతో మేకర్స్ చూపు సాయి పల్లవిపై పడిందని తెలుస్తోంది. కథానుసారం యన్టీఆర్ 30లో తారక్ సరసన సాయి పల్లవి గనకైతే సరిగ్గా సూటవుతుందని కొరటాల శివ బృందం భావించి ఆమెను ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించారట. యన్టీఆర్ లాంటి స్టార్, కొరటాల వంటి స్టార్ డైరెక్టర్ ప్రాజెక్ట్ అంటే సాయి పల్లవి అసలు వదులుకునే ప్రసక్తే లేదు. అందుకే, ఈ ప్రాజెక్ట్‌కు తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ సరసన నటించేందుకు ఈ ఫిదా బ్యూటీ సైన్ చేసింది. ఇప్పుడు యన్టీఆర్ #30 కోసం ఒకే చెప్పిందట.













