చరణ్ తో సాయి పల్లవి
ఆర్ఆర్ఆర్ సినిమతో గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సానతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అనౌన్స్మెంట్ తర్వాత నుంచి ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్, రాషా టాండన్, కీర్తి సురేష్ ఇలా చాలా పేర్లు మొదట్లో వినిపించాయి కానీ ఇప్పుడు మరో పేరు ఈ లిస్ట్ లోకి వచ్చింది. అది మరెవరో కాదు సాయి పల్లవి.
ఈ సినిమాలో హీరోయిన్ గా చరణ్ పక్కన సాయి పల్లవిని ఎంపిక చేయాలని చూస్తున్నాడట బుచ్చిబాబు. ఇప్పటివరకు భారీ కమర్షియల్ సినిమాల్లో నటించని సాయి పల్లవి, టాలీవుడ్ లోని టాప్ హీరోలతో ఎవరితోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాలో నటిస్తుండటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ప్రస్తుతం ఈ విషయమై సాయి పల్లవిని సంప్రదిస్తున్నారని, ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు.













