తండేల్కు సాయి పల్లవి బాగానే ఛార్జ్ చేస్తుందే!
హీరోయిన్స్ అందరికీ భిన్నంగా సాయి పల్లవి సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ పాత్రలు కాకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేసే సాయి పల్లవిని తెలుగు ఆడియన్స్ లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. విరాట పర్వం, గార్గి సినిమాల తర్వాత కథల విషయంలో టైమ్ తీసుకుంటున్న సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేస్తుంది.
చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చైతూ పాత్రతో సమానంగా సాయి పల్లవి క్యారెక్టర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. మొన్నటివరకు కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న సాయి పల్లవి ఓ రెండు సినిమాలకు రూ.2 కోట్ల వరకు కూడా ఛార్జ్ చేసిందని టాక్.
ఇప్పుడు చైతన్య సినిమాకు ఏకంగా రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ను తీసుకోబోతుందని తెలుస్తోంది. సాయి పల్లవి కావాలని పట్టు బట్టిన వారు ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారని టాక్. ఇప్పటికే కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి, తెలుగులో చైతూతో కలిసి తండేల్ చేస్తుంది. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా పెద్ద హిట్ అవడంతో తండేల్ కూడా సూపర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ జోస్యం చెప్తున్నారు.













