యష్ సరసన సాయి పల్లవి?
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం స్టోరీ నచ్చితే తప్ప సినిమాలు ఓకే చేయని సాయి పల్లవికి ఫిదా సినిమాలో భానుమతిగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి తండేల్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
తండేల్ లో సాయి పల్లవి క్యారెక్టర్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేయడం వల్లే సాయి పల్లవి ఆ సినిమాను ఓకే చేసిందని టాక్. అది కాకుండా సాయి పల్లవి ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కన్నడ హీరో యష్ చేయనున్న 19వ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైందని శాండల్‌వుడ్ మీడియా వర్గాలు చెప్తున్నాయి.
ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఫస్ట్ లుక్ తో పాటూ టైటిల్ లాంచ్ లో ఈ వివరాలేమైనా ప్రకటిస్తారేమో చూవాలి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో గోవా మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ యష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాలకు సాయి పల్లవి తోడవ్వడంతో ఇప్పుడు అవి మరింత పెరిగాయి. ఏదేమైనా సాయి పల్లవి భాషతో సంబంధం లేకుండా భలే దూసుకుపోతుంది.













