చైతూ నిర్మాతలు ఏ హీరోయిన్ కి ఓటేస్తారో?
ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఎప్పటికప్పుడు డిజాస్టర్ల దెబ్బ తగులుతూనే ఉంది. ఆయన నుంచి వచ్చిన రీసెంట్ సినిమా కస్టడీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక ఫ్లాప్ గా మిగిలింది. దీంతో తన తర్వాతి సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్నాడు చైతూ.
ఈ నేపథ్యంలోనే చందూ మొండేటితో చేతులు కలిపి ఓ సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. మత్య్సకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చైతూ ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. వాస్తవానికి దగ్గరగా ఉండాలని వారి జీవితం ఎలా ఉంటుంది? వారెలా ఉంటారనేది స్వయంగా మత్య్సకారుల గ్రామాలకు వెళ్లి మరీ తెలుసుకున్నాడు చైతూ.
ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మొదట్లో అనుపమను అనుకున్నప్పటికీ ఇప్పుడు కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. వీరిద్దరూ అయితే డీ గ్లామర్ రోల్ లో కూడా ఆడియన్స్ ను తమ నటనతో ఇంప్రెస్ చేయగలరు.
మరి వీరిద్దరిలో నిర్మాతలు ఏ హీరోయిన్ కు ఓటేస్తారో చూడాలి. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.













