తనకు గ్లామర్ అనే పదం నచ్చదు
గ్లామర్‌షో చేయకపోవటం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది సాయిపల్లవి. ఫిధా, పడిపడిలేచే మనసు సినిమాల్లో సాయిపల్లవి మేకప్‌లేకుండా నటించి అందరినీ ఫిదా చేసింది. తనకు మేకప్ అంటే అసలు ఇష్టం ఉండదని, మేకప్ వేసుకోవటం వల్ల తన నాచురల్ అందం పోతుందని, మేకప్ లేకుంటేనే బాగుంటానని పేర్కొంది. ఇక గ్లామరస్‌గా కన్పించేందుకు అస్సలు ఒప్పుకోనని అంటోంది. తనకు గ్లామర్ అనే పదమే నచ్చదని, నాచురల్‌గా ఉంటమే ఇష్టమని చెబుతోంది. ఫిదా మూవీలో ఓ సీన్‌కోసం మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్వేసుకుంది సాయి.. మొద• ఆ డ్రెస్ వేసుకోవటానికి సాయిపల్లవి అసలు ఒప్పుకోలేదట. అయితే ఆసీన్కి ఈ డ్రెస్ వేసుకోవటం చాలా అవసరం కావటంతో డైరెక్టర్ ఆ సీన్ ప్రాధాన్యం చెప్పటంతో ఒపుకుని వేసుకుందట. అయితే ఇకపై మాత్రం అసలు అలాంటి డ్రెస్‌లు వేసుకోనని సాయిపల్లవి తెగేసి చెప్పింది.













