స్టార్ హీరోయిన్లకు సాయి పల్లవి టెన్షన్
సాయి పల్లవి.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్లర్లేదు. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈమె గురించే డిస్కషన్. ఫిదా సినిమా చూసినప్పుడు ఏదో ఒక మాదిరిగా ఉందిలే అనుకున్న ప్రేక్షకులు తర్వాత తన అందం మొత్తం తన నటనలోనే ఉందని చెప్పుకునేలా ఆకట్టుకుందంటే సాయి పల్లవి రేంజ్ అర్థం చేసుకోవచ్చు.
మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు లు చూశాక తెలుగు తెరకు మరో సహజ నటి దొరికేసిందనుకున్నారు. తెలుగులో తన రిలీజ్ అయిన సినిమాలు ఐదారు మాత్రమే అయినా తన క్రేజ్ మాత్రం కొలవలేనిది. దానికి కారణం ఆమె సన్నివేశంలో ఇమిడిపోయే విధానం, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ను తను పలికించే విధానం, ముఖ్యంగా ఏ హీరోయిన్ కూ లేని గ్రేస్ తన డ్యాన్స్ లో ఉండటం. ఎంత ఫాస్ట్ స్టెప్స్ అయినా ఇట్టే వేయడంతో పాటూ తన హావభావాలను కూడా అసలు మిస్ కానివకుండా ఉండటం సాయి పల్లవి స్పెషాలిటీ.
సాయి పల్లవి నుంచి ఈ సంవత్సరం మూడు సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నాగ చైతన్య జోడీగా రానున్న లవ్ స్టోరీ. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సారంగదరియా సాంగ్ కు వచ్చిన క్రేజ్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. రానా హీరోగా వేణు ఉడుగుల డైరక్షన్ లో విరాటపర్వం కూడా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇక రాహుల్ డైరక్షన్ లో నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ క్రేజ్ దక్కించుకున్న సాయి పల్లవి ఈ మూడు సినిమాల తర్వాత నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయమని తెలుస్తుంది. గ్లామరస్ హీరోయిన్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న సాయి పల్లవిని చూసి స్టార్ హీరోయిన్స్ సైతం టెన్షన్ పడుతున్నారంటే సాయి పల్లవి రేంజేంటో అర్థమవుతుంది కదూ..













