ప్రభాస్ ‘సలార్’ చిత్రం లో సాయి పల్లవి?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరస మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ కొత్త ఏడాది నాదే అంటున్నాడు. ఈ ఏడాది ఎలాగైనా కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని రెబెల్ స్టార్ గట్టి పట్టుదల మీద ఉన్నాడు. ఇక ప్రభాస్ రాధేశ్యాం సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఈ మూవీ తరువాత ముందుగా సలార్ అంటూ కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ తొందరలోనే మొదలు కాబోతోంది. అయితే ఈ మూవీ లో ఇప్పటికే కాస్టింగ్ ఎవరు అన్నది కూడా సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారని టాక్. మలయాళం టాప్ హీరో మోహన్ లాల్ ఈ మూవీలో అతి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే రానా దగ్గుబాటి బాహుబలి తరువాత తిరిగి ప్రభాస్ కాంబోలో నటిస్తున్నాడు అంటున్నారు. దాంతో ఈ మూవీకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తోంది.
ఇవి పక్కన పెడితే మెయిన్ ఈ మూవీలో హీరోయిన్ రోల్. దాని కోసం చాలా పేర్లు ప్రచారంలో అయితే ఉన్నాయి. బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీని కూడా పరిశీలిస్తున్నారు అంటున్నారు. అయితే ఇపుడు అన్నింటికీ మించి ఒక అనూహ్యమైన న్యూస్ వెలుగులోకి వస్తోంది. అదేంటి అంటే ఈ మూవీలో ఫిదా హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. అదే కనుక జరిగితే ఈ మూవీ మీద అంచనాలు రెట్టింపు కావడం ఖాయం. గ్లామర్ తో పాటు పెర్ఫార్మన్స్ సైడ్ కూడా దిట్ట ఇక డాన్స్ విషయం లో చెప్పాల్సిన అవసరం లేదు.
మరో విషయం సాయి పల్లవి ప్రభాస్ జోడీ అంటే కంప్లీట్ ఫ్రెష్ లుక్ ఉంటుంది. అంతే కాదు పోటా పోటీగా ఈ జంట కనిపిస్తుంది అంటున్నారు. ప్రభాస్ హైట్ కి సరిపడకపోయిన ఈ మూవీలో హీరోయిన్ రోల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని దృష్టిలో ఉంచుకునే ఈ విధంగా చేస్తున్నారు అని తెలుస్తోంది. సాయి పల్లవి అయితే ధీటుగా ఆ రోల్ ప్లే చేస్తుంది అని కూడా అంటున్నారు. ఇక సాయిపల్లవి కి తెలుగు తమిళ్, మళయాళంలో కూడా మంచి ఆదరణ ఉంది. ఈ పాన్ ఇండియా మూవీకి ఆమె పూర్తిగా సెట్ అవుతారు అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడుట. మరి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు చూడాలి ఏం జరుగుతుందో?













