సాయి పల్లవి కండిషన్స్
పడిపడిలేచే మనసు చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్నా.. ఈ చిత్రం మళ్లీ రీషూట్ జరుపుతున్నారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు. అయితే మళ్లీ ఇందులో పాల్గొనటానికి సాయిపల్లవి కొన్ని కండిషన్లు పెట్టిందట. తను ఇచ్చిన డేట్స్ కంటే ఎక్కువ రోజులు ఈ చిత్రానికి పనిచేయాల్సి ఉండటంతో ఈ రీషూట్కు పాల్గొనే రోజుకు పారితోషికం ఇవ్వాలని అడిగిందని తెలిసింది. ఇందుకు నిర్మాతలు ఓకే చెప్పారని కూడా తెలిసింది. చెరకూరి సుధాకర్, చుక్కపల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ చిత్రం డిసెంబర్ 21న విడుదల కాబోతోంది.













