మహాసముద్రంలో సాయిపల్లవి!
ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన రెండో చిత్రం మహాసముద్రంని పట్టాలెక్కించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే రవితేజ, నాగచైతన్యకు కథ వినిపించారు. వీళ్ళలో ఒకరు ఆల్మోస్ట్ ఫైనల్ అవుతారని ఆశించిన టైమ్‌లో ఈ ఇద్దరూ నో చెప్పారు. దీంతో ఆయన శర్వానంద్‌కి కథ వినిపిస్తే, శర్వా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో శర్వా సరసన సాయిపల్లవి నటించనుందని సమాచారం. ఈ కథని దర్శకుడు అజయ్ ఇప్పటికే సాయిపల్లవికి నెరేట్ చేస్తే, ఆమెకు కథ నచ్చి నటించేందుకు పచ్చా జెండా ఊపినట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ఈ చిత్రంతో పాటు నాగచైతన్యతో లవ్‌స్టోరీ చిత్రంలోనూ నటిస్తోంది. ఫిదా తర్వాత శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లివి నటిస్తున్న చిత్రమిది.













