సాయి పల్లవి డెడికేషన్ కు హ్యాట్సాఫ్!
సినిమాలను, పాత్రలను ఎంచుకోవడంలో సాయి పల్లవి(Sai Pallavi) ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ కాలంలోనే సాయ పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి తను సెలెక్ట్ చేసుకునే పాత్రలే కారణం. సాయి పల్లవి ప్రస్తుతం మేజర్ ముకుందన్ వరజరాజన్(Major Mukundan Varajarajan) జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియాసామి(Raj Kumar Periyasaami) తెరకెక్కిస్తున్న అమరన్(Amaran) సినిమాలో నటిస్తోంది.
ఇందులో ముకుందన్(Mukundan) పాత్రలో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటించనున్నాడు. ముకుందన్ భార్య రెబాకా పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. అమరన్ బయోపిక్ కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. సినిమాలో బలమైన ఎమోషన్ ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఈ నేపథ్యంలో అమరన్ లోని తన పాత్ర గురించి సాయి పల్లవి స్పందించింది.
తను ఇప్పటివరకు బయోపిక్ లో నటించింది లేదని, వచ్చిన పాత్రను సద్వినియోగం చేసుకుంటూ భావోద్వేగాలకు పూర్తిగా న్యాయం చేసేలా పనిచేశానని, అమరన్ లో ఛాన్స్ వచ్చిన్ టైమ్ లో ముకుందన్ భార్య రెబాకా(Rebacca)ని కలిశానని, ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడి పాత్రకు సంబంధించిన ఎమోషన్ పై అవగాహన సంపాదించానని, ఈ విషయంలో రెబాకా తనకెంతో సహకరించారని సాయి పల్లవి చెప్పింది. తను ఎంచుకున్న పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి సాయి పల్లవి ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.













