Sai Durga Tej: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన తేజ్
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం తేజ్ మీడియాతో మాట్లాడాడు. తిరుమల వచ్చిన సందర్భంగా తేజ్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
తనకు మంచి సినిమాలు, మంచి లైఫ్ ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పి, కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నానని చెప్పాడు తేజ్. తాను హీరోగా నటిస్తున్న సంబరాల ఏటి గట్టు సినిమా నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ కానుందని, ఆ మూవీపై తానెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నానని తేజ్ చెప్పాడు.
మీ పెళ్లిపై వార్తలొస్తున్నాయి కదా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, వచ్చే ఏడాదిలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానని అనౌన్స్ చేశాడు. దీంతో తేజ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది సంబరాల ఏటి గట్టు సినిమాతో పాటూ తేజ్ ఓ ఇంటి వాడవుతున్నాడని, ఈ రెండు విషయాలూ తేజ్ జీవితాన్నే మార్చబోతున్నాయంటూ తెగ సంతోషిస్తున్నారు.






