Sai Durga Tej: ఈ సీక్వెల్ సంగతేంటి తేజూ?
సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) యాక్సిడెంట్ తర్వాత సినిమాల వేగాన్ని తగ్గించాడు. రీసెంట్ గా సంబరాల ఏటిగట్టు(Sambarala Yeti gattu) సినిమాను మొదలుపెట్టిన సాయి తేజ్ ఈ సినిమాతో పాటూ ఓ సినిమాకు సీక్వెల్ ను కూడా చేస్తాడని వార్తలొచ్చాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన చిత్రలహరి(Chitralahari) సినిమాకు సీక్వెల్ గా చిత్రలహరి2 ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది.
చిత్రలహరి సినిమాలో హీరో కథ ఒక ఫెయిల్యూర్ స్టోరీ. కానీ ఫైనల్ గా సినిమా ఎండింగ్ లో సక్సెస్ మార్గాన్ని కనిపెడతాడు. ఆ సినిమా యూత్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో సాంగ్స్ కూడా మంచి హిట్స్. చిత్రలహరి తర్వాత కిషోర్ తీసిన రెడ్(Red), ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu Miku Joharlu) సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.
అందుకే తేజ్ తో చిత్రలహరి2(Chitralahari2) చేయాలని కిషోర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. కానీ తేజ్ మాత్రం ఇప్పుడప్పుడే ఆ సినిమాను చేసే ఆలోచనలో లేడని సమాచారం. ప్రస్తుతం తేజ్ ఫోకస్ మొత్తం సంబరాల ఏటి గట్టు మీదే ఉందని, ఇప్పుడు చిత్రలహరి2 చేయాలంటే తన లుక్స్ మార్చాలి కాబట్టి తేజ్ ప్రస్తుతానికి తేజ్ ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలుస్తోంది.













