తేజూ కోసం మాస్ టైటిల్
గతేడాది రోడ్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ సిట్యుయేషన్ ఏమవుతుందో అని అందరూ టెన్షన్ పడ్డారు. తర్వాత వచ్చిన రిపబ్లిక్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్గా విరూపాక్ష తో అందరూ ఊహించని విజయాన్ని అందుకుని తేజూ సూపర్ సక్సెస్లోకి వచ్చాడు. లో బజ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయింది.
ఈ ఏడాది సమ్మర్ లో టాలీవుడ్ కు బిగ్గెస్ట్ సక్సెస్ విరూపాక్షనే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ లో తేజూ, తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సంపత్ నంది తో తేజూ ఓ సినిమా ను ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ టైటిల్ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. గోలీ శంకర్ అనే మాస్ టైటిల్ను ఈ సినిమాకు పెట్టాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గంజా శంకర్ అనే టైటిల్ను కూడా ఈ సినిమా కోసం పరిశీలించినప్పటికీ గంజా అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఉద్దేశంతో గోలీ శంకర్వైపే మేకర్స్ మొగ్గు చూపినట్లు సమాచారం.
త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. సినిమా అనౌన్స్మెంట్ రోజే టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తేజూ చాలా ఏళ్ల తర్వాత చేయబోతున్న మాస్ మూవీ ఇది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













