ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న మెగా మేనల్లుడు
ఈ ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. సాయి తేజ్ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో చాట్ సెషన్ నిర్వహించాడు.
ఫ్యాన్స్ తో సరదాగా సంభాషించిన సాయి తేజ్, పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఇందులో భాగంగా ఒక ఫ్యాన్, పవన్ తో సినిమా చేశావ్, చిరూతో సినిమా ఎప్పుడు అని అడగ్గా, దానికి సాయి తేజ్ సమాధానమిస్తూ ఆ ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. చిరంజీవి, సాయి తేజ్ కాంబోలో మూవీ వస్తే వారి హంగామా తెరపై మామాలుగా ఉండదని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
తన తర్వాతి సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ చేస్తున్న సాయి తేజ్, ఆ సినిమాతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటానని తెలిపాడు. తనకు ఎప్పటిలాగే అందరి ఆదరణ, ప్రేమ కావాలని, ఆడియన్స్ ను మెప్పించడమే తన బాధ్యత అని సాయి తేజ్ చెప్పాడు. గాంజా శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్న సాయి తేజ్ కు ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













