చిత్రలహరి తర్వాత… భోగి
వరుస అపజయాల తర్వాత ఫామ్లోకి వచ్చాడు హీరో సాయిధరమ్. మెగా కంపౌండ్ హీరోగా మంచి పేరున్నా ఫెయిల్యూర్స్ ఆయన వేగానికి బ్రేక్ వేశాయి. అయితే ఇటీవలే విడుదలైన చిత్రలహరి సినిమా హిట్ కావడంతో మళ్లీ వేగం పుంచుకున్నాడు సాయిధరమ్. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలించారు. చివరగా భోగి అనే పేరును నిర్ణయించినట్టు తెలిసింది. ఇది అచ్చమైన తెలుగు పేరు కావడంతో ఈ సినిమా కుటుంబనేపథ్యంతో రూపొందుతుందని భావించవచ్చు. ఈ సినిమా వివరాలపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













