దాన్ని కన్ఫర్మ్ చేసిన సాయి తేజ్
తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేసి, థియేటర్లలో సందడి చేస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తన తర్వాతి సినిమాను సంపత్ నంది డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమకు గాంజా శంకర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ నుంచి స్పూర్తి పొంది ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలొచ్చాయి.
అయితే ఎన్ని వార్తలొచ్చినా ఈ సినిమా టీమ్ నుంచి మాత్రం టైటిల్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. రీసెంట్గా బ్రో ప్రమోషన్స్‌లో పాల్గొన్న తేజ్, ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశాడు. ప్రమోషన్లలో భాగంగా తర్వాత ఏం సినిమాలు చేస్తున్నారని తేజ్‌ని అడగ్గా, దానికి సమాధానంగా సంపత్ నందితో గాంజా శంకర్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
హెల్త్ పరంగా కొన్ని నెలల పాటూ బ్రేక్ అవసరమని, ఆ తర్వాత గాంజా శంకర్ షూటింగ్ లో పాల్గొనన్నుట్లు సాయి తేజ్ తెలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే లేదా శ్రీలీల నటించే అవకాశముంది. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సంపత్ నంది గాంజా శంకర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్నాడు.













