భారీ బడ్జెట్ తో సాయి తేజ్ సినిమా
విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్, తర్వాత పవన్ తో కలిసి బ్రో అనే సినిమా చేశాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం కొత్త కథలు వినడం స్టార్ట్ చేశాడు తేజ్. అయితే హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సాయి తేజ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత తేజ్ కు మంచి అడ్వాన్స్ ఇచ్చి తన నెక్ట్స్ సినిమాను సదరు నిర్మాత ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో రోహిత్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. జూన్ లో సినిమా చాలా లాంఛనంగా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా చాలా భారీ బడ్జెట్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. యంగ్ డైరెక్టర్ రోహిత్ తో తేజ్ చేస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లోనే సంచలనం కానుందంటున్నారు. ఇది కాకుండా మరిన్ని సినిమాలు చేయడానికి కూడా తేజ్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రానుంది.













