Sai Durga Tej: క్లైమాక్స్ మార్చడానికి ఒప్పుకోని తేజ్
సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) కెరీర్లో స్పెషల్ మూవీల్లో ఒకటిగా ఎప్పటికీ రిపబ్లిక్(Republic) ఉంటుంది. దేవ కట్టా(Deva Katta) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అవలేదు. అంతేకాదు రిపబ్లిక్ కు సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ ఓటీటీలో వచ్చాక మాత్రం అందరూ సినిమాను తెగ ప్రశంసించారు.
సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటే రిపబ్లిక్ కమర్షియల్ గా సక్సెస్ అయేదని అందరూ అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరోను చంపేయకుండా ఉండాల్సిందని, సినిమాకు కాస్త కమర్షియల్ టచ్ ఇవ్వాల్సిందని అందరూ అభిప్రాయపడ్డారు. తాను కూడా ఒక దశలో రిపబ్లిక్ క్లైమాక్స్ మార్చే విషయంలో ఆలోచన చేసినట్టు దేవ కట్టా తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.
ఈ విషయాన్ని తేజూకి ఫోన్ చేసి చెప్తే, క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా తనది కాదని తేల్చి చెప్పాడని, దటీజ్ తేజు అని దేవ కట్టా వ్యాఖ్యానించాడు. ఏదేమైనా ఆ రోజు తేజూ దర్శకుడి మాట విని ఉంటే రిపబ్లిక్ ఓ మంచి సినిమాగా మారి ఉండేది. ప్రస్తుతం తేజూ, రోహిత్(Rohit) అనే దర్శకుడితో సంబరాల ఏటి గట్టు సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.













