విరూపాక్ష సీక్వెల్‌ని కన్ఫర్మ్ చేసిన తేజ్
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా, కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులేస్తుంది. గత వారం రిలీజైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే ఈవెనింగ్ నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా సందడి చేస్తోంది.
మార్నింగ్ షోలతో పోలిస్తే ఈవెనింగ్ ఫస్ట్ షో లు బాగా పుంజుకున్నాయి. వీకెండ్లో ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. యూఎస్‌లో ఈ సినిమా మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఏదైనా సినిమా హిట్ అయితే దాని సీక్వెల్ గురించి ఇప్పుడు చర్చ జరగడం ప్రస్తుత ట్రెండ్. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండి, స్టోరీని పొడిగించడానికి ఛాన్స్ ఉన్నప్పుడు మేకర్స్ కూడా ఆ దిశగా చిన్న హింట్ ఇచ్చి వదిలిపెడతారు.
విరూపాక్ష సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా క్లైమాక్స్ లో తేజు కళ్లు చిత్రంగా మారుతాయి. అంతటితో మూవీ ఎండ్ కార్డ్ పడిపోయింది. ఊరందరినీ రక్షించిన హీరో తనే దయ్యం పట్టినట్లుగా కనిపించడంతో కథ ఇంకా ముగియలేదు. సెకండ్ పార్ట్ ఉంటుందన్న భావన కలుగుతుంది. ఈ విషయాన్ని గురించి రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ ను ఓ ఫ్యాన్ ట్విట్టర్ లో ప్రస్తావించాడు.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని తేజ్ ని అడగ్గా, ఉంది కాబట్టే కదా హింట్ ఇచ్చాం అంటూ విరూపాక్ష సీక్వెల్ ను కన్ఫర్మ్ చేశాడు తేజ్. ఈ సినిమా స్టోరీని పొడిగించడానికి కూడా స్కోప్ ఉంది. గతంలో ఇదే జానర్లో తెరకెక్కిన కార్తికేయ సినిమాను కూడా ఫ్రాంఛైజీగా మార్చిన సంగతి తెలిసిందే. మరి విరూపాక్ష-2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.













