తేజ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ వరుసపెట్టి సినిమాలు చేస్తాడనుకుంటే గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేశాడు కానీ అది పవన్ అకౌంట్ లోకే వెళ్లింది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రీసెంట్ గానే మొదలైంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో రూపొందనుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఆమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
1947 కాలంలో కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబరాల ఏటి గట్టు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాట. ఇప్పటికే ఆ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని టాక్. విరూపాక్ష హిట్ తో తేజ్ మార్కెట్ బాగానే పెరిగింది. అందుకే ఈ సినిమాను ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మించాలని మేకర్స్ చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన విలేజ్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా గ్లింప్స్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.













