మోక్షజ్ఞ ఎంట్రీపై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చి స్టార్డమ్ ను సొంతం చేసుకుని ఓ వెలుగు వెలుగుతున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఇప్పటికీ జరగలేదు. ఇదిగో అదిగో అని వార్తలొస్తున్నాయి తప్పించి ప్రతీసారి ఏదో రీజన్‌తో మోక్షు ఎంట్రీ వాయిదా పడుతూనే ఉంది.
దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. ఎన్ని వార్తలొస్తున్నా, ఎన్ని డిస్కషన్స్ జరుగుతున్నా బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. రెండేళ్ల క్రితం ఆదిత్య 999తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉందన్నారు. ఆ తర్వాత బాలయ్య డైరెక్టర్ గా తన కొడుకుని పరిచయం చేస్తాడన్నారు కానీ ఏదీ జరగకపోవడంతో మోక్షు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని చర్చ మొదలైంది.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై భగవంత్ కేసరి నిర్మాత హరీష్ గారపాటి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నారని, అందులో భాగంగా సినిమా నిర్మాణం అర్థం చేసుకోవడానికే మోక్షజ్ఞ రెగ్యులర్ గా భగవంత్ కేసరి సెట్స్ కు వచ్చేవాడని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య గ్రౌండ్ వర్క్ బాగానే చేయిస్తున్నట్లు తెలుస్తోంది.













