స్వాంత్య్ర దినోత్సవ కానుకగా సాహో
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సాహో. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను 2019 స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాల్లో ఉందని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ రాయ్ సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.













