విక్రమ్ కు జోడీగా కీర్తి, త్రిష…
తెలుగు, తమిళంలో తనకంటూ ఓ గుర్తింపును కలిగిన విక్రమ్ నటిస్తున్న మరో చిత్రం ధ్రువ నట్చత్తిరమ్. ఈ చిత్రాన్ని తెలుగులో ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి గౌతమ్ మీనన్ దర్శకుడు. ఈ మూవీ తర్వాత తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సామి మూవీ సీక్వెల్ ను చేయనున్నాడు. 2003లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో నే విక్రమ్ స్టార్ నటుడిగా గుర్తింపు పొందాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌ను అప్పటి దర్శకుడు హరితో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
2003లో వచ్చి బాక్ల్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్‌గా తెరక్కెన్ను ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కనుంది. విక్రమ్ సరసన కథానాయికలుగా కీర్తి సురేష్, త్రిషలని ఎంపిక చేశారు. బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మానంలో సామి 2 రూపొందనుంది. దేవీశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు.













