బే ఏరియాలో ‘సాహో’ రిలీజ్ హంగామా
అమెరికాలో సాహో హంగామా ఇప్పుడు కనిపిస్తోంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నతమైన సాంకేతికతో విడుదలవుతున్న సాహో కోసం అమెరికాలోని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియాలోని 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో ఈ సినిమా రిలీజ్ అవుతోఞది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తోతెరకెక్కిన ఈ మూవీని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా అమెరికాలో సాహో ప్రీమియర్ షో టిక్కెట్లకోసం అభిమానులు వరుసకట్టారు. దాదాపు 250 సెంటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్‌కు ఇప్పటికే దాదాపు 5వేల డాలర్లకుపైగా వసూలయ్యాయని సినిమా ఎగ్జిబిటర్లలో ఒకరైన మధు గార్లపాటి తెలిపారు. సంజయ్ దూసరి మరో ఎగ్జిబిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సాహో సినిమా ప్రీమియర్ షోకి ఇప్పటికే బాగా హైప్ వచ్చిందని టిక్కెట్లు కూడా హాట్కేక్లాగా అమ్ముడుపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే 5వేల డాలర్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ప్రీమియర్ రిలీజ్ అయ్యే సమయానికి 1 మిలియన్ వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని గురువారం సాయంత్రం ప్రీమియర్ షో వేస్తున్నట్లు చెప్పారు. తాము గతంలో కూడా కబాలి, మనం, భలేభలే మగాడివోయ్ వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించామని, కాని ఇప్పుడు ఎగ్జిబిటర్లుగా సరికొత్త పద్ధతిలో బిజినెస్ మొదలు పెట్టామని చెప్పారు. ఇప్పటికే సాహో బాగుందనే టాక్ వస్తోందని ఈ సినిమా అమెరికాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని కూడా అనుకుంటున్నట్లు మధు గార్లపాటి చెప్పారు. సాహో సినిమాకు వచ్చేవారు సెల్ఫీ తీసుకునేలా సాహో వాల్ కూడా కట్టామని, ఇలా వచ్చినవారికి సౌకర్యాలు, వినోదాన్ని అందిస్తున్నామని తెలిపారు.













