సాహో సరికొత్త రికార్డు
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సాహో సినిమా హిందీ టెలివిజన్ ప్రీమియర్ కొత్త రికార్డును సృష్టించింది. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్ సంస్థ రూపొందించిన ఈ చిత్రాన్ని ఇటీవలే హిందీలో టెలివిజన్ ప్రీమియర్ చేశారు. ఈ సినిమాకు 128.20 లక్ష వ్యూస్ లభించాయి. ఈ మధ్యకాలంలో టీవీలో టెలికాస్ట్ అయిన కాలికా కరిష్మా, పోలీస్ ఔర్ టైగర్, సింబా, కేజీఎఫ్ ఛాప్టర్-1 చిత్రాల్ని సాహో అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్‌కు ఇది అద్దం పట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.













