సినిమా ఫ్లాప్…కలెక్షన్లు తోపు
తెలుగు ప్రజలు అంతగా ఆదరించకపోయినా.. హీందీ ప్రేక్షకులు సాహో సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 150 కోట్ల క్లబ్బులో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఫ్లాప్ సినిమాతో ఇన్ని కోట్లు రాబడితే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి అనే చర్చ కూడా బాలీవుడ్లో మొదలైపోయింది. సాహోలో హీరోయిన్ (శ్రద్ధాకపూర్) మొదలుకొని పలువురు నటీనటులు బాలీవుడ్ వారే కావడం బాగా కలిసి వచ్చింది. సత్వహా యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే హిందీ అడియన్స్.. హాలీవుడ్ రేంజ్లో పిక్చరైజ్ చేసిన యాక్షన్ సీన్స్‌తో కూడిన సాహోను సమాదరించారు. షారుఖాన్ రాయిస్, ఆయుష్మాన్‌ఖురానా బదాయిహో, వరుణ్‌ధావన్ జుద్వా 2 కలెక్షన్లను సాహో అధిగమించడం గమనార్హం.













