RX 100 హీరో కార్తికేయ కొత్త సినిమా టైటిల్ ‘హిప్పీ’
‘RX 100’ చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయకి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడు ఓ బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో భారీ చిత్రాలను తెరకెక్కించిన థాను.. తుపాకీ, కబాలి, విఐపి2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రస్తుతం ఆయన కార్తికేయ హీరోగా సినిమా చేస్తున్నారు. టిఎన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కార్తికేయ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘హిప్పీ’ అనే టైటిల్ ని రివీల్ చేస్తూ కార్తికేయ స్టిల్ ని వదిలింది. అక్టోబర్ నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.













