PKSDT టైటిల్ అదేనా?
ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలు రెస్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటున్నాడు. గ్యాప్ లేకుండా ఒకటికి నాలుగు సినిమాలు చేస్తున్నాడు పవన్. అందులో ఒకటి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న వినోదాయ సీతం రీమేక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై అందరికీ మంచి ఆసక్తి ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. ఈ పదాన్ని సాధారణ జీవితంలో వాడని మనిషి దాదాపుగా ఉండరు. కానీ ఈ మాట అందరికీ నచ్చదు. బ్రదర్‌ని షార్ట్ కట్ చేసి దారుణంగా మార్చారనే వాదనలు కూడా కొంతమంది చేస్తుంటారు. అలాంటి బ్రో ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సినిమాకు టైటిల్‌గా పెడతారా అని పవన్ ఫ్యాన్స్ ఈ టైటిల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ టైటిల్ కంటే దేవర అనే టైటిల్ చాలా బెటర్ అని కూడా ఫ్యాన్స్ అభిప్రాయం వెల్లిబుచ్చుతున్నారు. నిజానికి ఈ సినిమాకు కాల భైరవ అనే టైటిల్‌ను అనుకున్నారట కానీ ఆ టైటిల్‌ను ముందుగానే లారెన్స్ రిజిస్టర్ చేయించుకున్నాడట. లారెన్స్ ని అడగాలని కూడా ట్రై చేశారట కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదని టాక్. దీంతో వేరే ఆప్షన్ లేక బ్రో అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడానికే చిత్ర యూనిట్ మొగ్గు చూపిందని టాక్. ఏదైనా ఊహించని మార్పులు జరిగితే తప్ప ఈ సినిమాకు దాదాపు ఈ బ్రో అనే టైటిల్ ఖాయమైనట్లే అని అనుకోవాలి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసిన సముద్రఖని, మిగిలిన బ్యాలెన్స్ షూట్‌ను ఈ నెలలోనే ఫినిష్ చేయబోతున్నాడట. జూన్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ లేకుండా నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. అటు ఇటు చేసి ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారేమో చూడాలి.













