తండేల్ ఏదోకటి తేల్చేస్తే బెటర్
నాగచైతన్య(naga chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్(Thandel) రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం ఇంకా అంతే ఉంది. నితిన్(nithin) రాబిన్హుడ్(robbinhood) డిసెంబర్ 20న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. తండేల్ నుంచి కూడా దసరాకు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ ఆ విషయంలో తండేల్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
అయితే డిసెంబర్ 20 నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేసే సిట్యుయేషన్ లేదని డైరెక్టర్ చెప్పడం వల్లే ఈ అనౌన్స్మెంట్ ఆగిపోయిందని కొందరంటున్నారు. తాజాగా తండేల్ సినిమా సంక్రాంతికి వస్తోందని వార్తలు వినిపించడంతో ఒక్కసారిగా అక్కినేని ఫ్యాన్స్(akkineni fans) ఎంతో యాక్టివ్ అయిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
అయితే ఇప్పటికే సంక్రాంతి పోటీలో గేమ్ ఛేంజర్(game changer), బాలయ్య109(NBK109), వెంకటేష్(venkatesh)-అనిల్ రావిపూడి(anil Ravipudi) మూవీ, సందీప్ కిషన్(sundeep Kishan) మజాకా(mazaaka) ఉన్నాయి. తండేల్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఇంత పోటీలో రిలీజ్ చేస్తే థియేటర్ల పరంగా ఇబ్బందులొచ్చే ఛాన్సుంది. గీతా ఆర్ట్స్(Geetha Arts) కు ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ అవతల కాంపిటీషన్ లో ఉన్న నిర్మాతలకు అంతకంటే ఎక్కువ నెట్వర్కే ఉంది. సినిమా బావుంటే సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు ఈజీగా ఆడతాయి కాబట్టి ఒకవేళ తండేల్ ను సంక్రాంతికి ఫిక్స్ చేయాలనుకుంటే ఇప్పటికైనా నిర్మాతలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













