పుష్ప2పై వైరలవుతున్న బాలీవుడ్ కథనాలు
ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన పుష్ప2 డిసెంబర్ 6కు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ ను మిస్ చేసుకున్నందుకు నిర్మాతలు నిరాశ పడ్డా సిట్యుయేషన్స్ అలాంటివి కాబట్టి ఏం చేయలేరు. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ పుష్ప2 షూటింగ్ ను రీస్టార్ట్ చేశాడు. త్వరలోనే అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
పుష్ప2 రిలీజ్ డేట్ మారడానికి ఫహద్ డేట్స్ దొరక్కపోవడం కూడా ఒక కారణం. ఇప్పుడంతా సెట్ అయ్యి షూటింగ్ జరుగుతున్న సమయంలో పుష్ప2 మళ్లీ వాయిదా పడుతుందని, డిసెంబర్ 6కి కూడా ఈ సినిమా రావడం కష్టమని, వచ్చే ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందనేలా బాలీవుడ్ మీడియా కథనాలు వెలువరిస్తోంది.
దానికి తగ్గట్టే డిసెంబర్ 6న బాలీవుడ్ మూవీ చావాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాలో కూడా రష్మికనే హీరోయిన్. నిజంగా పుష్ప2 అదే రోజున రిలీజైతే చావాని ఆ రోజు రిలీజ్ చేసేంత డేర్ చేస్తారా అనేది బాలీవుడ్ వర్గాల అభిప్రాయం. ఏదేమైనా ఈ విషయం ఇప్పట్లో తేలడం కష్టమే. పుష్ప2 రిలీజ్ కు మరో నాలుగు నెలలు మాత్రమే టైముంది. ఈసారైనా పుష్ప2 మేకర్స్ చెప్పిన డేట్ కు కట్టుబడి ఉంటారని ఆశిద్దాం.













