రాజా సాబ్ విషయంలో పలు ప్రచారాలు
ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడి సినిమా చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుందనే ఊహాగానాలు నెట్టింట బాగా వినిపిస్తున్నాయి. ఇదెంత వరకు నిజమనేది ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకైతే రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి నిర్మాణ సంస్థ ఎలాంటి అప్డేట్ ఇవలేదు. ఇప్పటికిప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే ఉద్దేశం కూడా వాళ్లకు లేదు. ముందు కల్కి సినిమా రిలీజ్ అవాలి. ఎలక్షన్స్ కారణంగా ఆ సినిమాను పోస్ట్ పోన్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ మే 9నుంచి వాయిదా పడితే మాత్రం సినిమా మరో రెండు మూడు నెలలు వెనక్కి వెళ్లే ఛాన్సుంటుంది.
మరోవైపు రాజా సాబ్ షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉంది. పేరుకే రాజా సాబ్ ఎంటర్టైనర్ తప్పించి, ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ డిమాండ్ చేసే కంటెంట్ ఇది. ఇవన్నీ కొలిక్కి రావాలంటే చాలానే టైమ్ పడుతుంది. అంతేకాదు, సంక్రాంతికి ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ నుంచి విశ్వంభర రిలీజ్ కానుంది. కాబట్టి ప్రభాస్ క్లాష్ పెట్టుకోవాలనుకోడు. కాబట్టి రాజా సాబ్ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన విషయం కల్కి రిలీజ్ గురించి. మరి ఈ విషయంలో కల్కి యూనిట్ ఎప్పటికి క్లారిటీ ఇస్తుందో చూడాలి.













