జై హనుమాన్.. నిర్మాత మారుతున్నాడా?
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హను మాన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజైన హను మాన్ చాలా పెద్ద రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను మేకర్స్ అప్పట్లోనే అనౌన్స్ చేశారు.
దీంతో ఆడియన్స్ జై హనుమాన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీ రాముడికి హనుమంతుడిచ్చిన మాటేంటి అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవగా, త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. 2026 సంక్రాంతికి ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.
తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డికి హను మాన్ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు సీక్వెల్ విషయంలో బడ్జెట్ గా భారీగా పెరగడంతో జై హనుమాన్ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. ఆయనకు బదులు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం జై హనుమాన్ లాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్టును ఎవరైనా ఎందుకు వదులుకుంటారని, ఇవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు.













